డిజిటల్ టెక్నాలజీతో నీటి నిర్వహణ
అధునాతన డిజిటల్ టెక్నాలజీ సాయంతో నీటి నిర్వహణ సమర్థంగా వినియోగించే అంశాలపై తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
- ఎన్హెచ్పీ ఫేజ్-2లో భాగంగా అమలు
- పైలట్ ప్రాజెక్టుగా శ్రీరాంసాగర్
- కేంద్ర జల్‌శక్తి శాఖ వర్క్‌షాప్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రజెంటేషన్
హైదరాబాద్, ఆగసు ్ట7 (నమస్తే తెలంగాణ): అధునాతన డిజిటల్ టెక్నాలజీ సాయంతో నీటి నిర్వహణ సమర్థంగా వినియోగించే అంశాలపై తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పైలట్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఢిల్లీలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో అందుకు సంబంధించిన ప్రణాళికను వివరించింది. ప్రపంచబ్యాంకు నిధులతో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ (పీఐపీ)ను ఫేజ్-2 కింద చేపట్టాలని ఎన్హెచ్పీ నిర్ణయించింది. అందుకోసం ఆయా అంశాలపై ఇటీవల అన్ని రాష్ర్టాల నుంచి పలు ప్రతిపాదనలను ఆహ్వానించింది. అందులో తెలంగాణ, గుజరాత్, అస్సాం ప్రణాళికలపై అత్యుత్తమంగా నిలిచాయి.
ప్రణాళికలపై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ర్టాలతో ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ను శుక్రవారం నిర్వహించింది. ఇరిగేషన్ శాఖ సెక్రటరీ శ్రీధర్, హైడ్రాలజీ విభాగం ఎస్ఈ వెంకటరమణ పాల్గోన్నారు. తెలంగాణ రూపొందించిన ‘డబ్ల్యూ అమృతం’ (వాటర్- అడ్వాన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, టెక్నాలజీ, అనాలసిస్, మానిటరింగ్) పై ఎస్ఈ వెంకటరమణ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేవలం జల వివరాల సేకరణకే పరిమితం కాకుండా, ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వరద నియంత్రణ, జలాశయాల నిర్వహణ, సాగునీటి పంపిణీలో విప్లవాత్మక మార్పులు తేవడమే తమ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. చెరువుల నిర్వహణ కోసం ‘మైనర్ ఇరిగేషన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్’ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. సాగునీటి నిర్వహణ మెరుగుపరిచేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

