చర్లపల్లి, జనవరి 26 : బాలికలకు న్యాయ సలహాలు, హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్ పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ జిల్లా కోర్టులో బాలికల జాతీయ దినోత్సవం సందర్భంగా నల్సార్ యూనివర్సిటీ, మహేంద్ర యూనివర్సిటీ, తెలంగాణ మహిళ కాలేజీ విద్యార్థినులకు బాలికలకు న్యాయం జరిగేలా చూడటం, హింసను అంతం చేయడం అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలకు చట్టపరమైన భద్రత కల్పించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినిలు పైయ్యావుల రమ్య, సియోనబాత్రలకు ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, పోలీస్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.