శంషాబాద్ రూరల్, జనవరి 26 : అమ్మపల్లి ఆలయం వద్ద ఫొటో షూట్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లాలోని నర్కూడ గ్రామస్తులు ఆలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మపల్లి ఆలయానికి దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఆలాంటి ఆలయంలో (ఫ్రీ వెడ్డింగ్ షూట్) పేరుతో షూట్స్‌కు అనుమతి ఇవ్వడంతో ఆలయంలో అశ్లీలంగా షూటింగ్ చేస్తూ ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.
ఆలయంలో పూర్తిగా షూటింగ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఆలయ ఈవో రామశర్మ అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. ఆలయం వద్ద షూటింగ్‌లను రద్దు చేయాలని గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని, వారి ఆదేశాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఈవో వివరించారు.