గద్వాల : మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ మంగళవారం గద్వాల అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) ఎన్నికలు 2020 ఫిబ్రవరిలో జరిగాయి. ఆ ఎన్నికల్లో కేటీ దొడ్డి మండలం ఉమిత్యాల గ్రామానికి చెందిన స్థానిక నాయకుడు కుర్వ కర్రేప్ప తల్లి మహదేవమ్మను బీజేపీ రంగంలోకి దించింది.
ఆ సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టారన్న ఆరోపణలతో కేటీ దొడ్డి పోలీసులు డీకే అరుణతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ఉదయ్ నాయక్ నిర్వహించిన ఎగ్జామినేషన్ ప్రక్రియలో డీకే అరుణ పాల్గొన్నారు.