హైదరాబాద్, మార్చి 7: భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను సీఐఐ తెలంగాణ చైర్మన్గా గౌతమ్ రెడ్డి (రీ సైస్టెనబిలిటీ లిమిటెడ్- వైస్ చైర్మన్), వైస్ చైర్మన్గా గౌరవ్ మహేశ్వరి నియమితులయ్యారు. శనివారం సమావేశమైన సీఐఐ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. నూతన చైర్మన్గా నియమితులైన గౌతమ్ రెడ్డికి పర్యావరణ సర్వీసెస్, వ్యర్థ పర్యావరణ నిర్వహణ, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విభాగాల్లో 27 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది.