హనుమకొండ, జూలై 21 : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో వ్యక్తిగత జన్మదిన వేడుకలు నిర్వహించడంపై వివిధ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హాజరై ఎమ్మెల్యేకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, ఇతర వ్యక్తుల జన్మదిన వేడుకలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టరేట్లో రాజేందర్‌రెడ్డి బర్త్‌డే వేడుకలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.