అమరావతి : తిరుపతి ( Tirupati ) జిల్లా శ్రీసిటి పరిశ్రమవాడలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ట్యాబ్లెట్లు తయారు చేసే టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో ఒక్కసారిగా బాయిలర్ పేలి ( Boiler Explosion) మంటలు వ్యాపించాయి. నైల్ షిఫ్ట్‌లో ఉన్న ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు.
మృతుల్లో ఇద్దరు సత్యవేడు మండలం చెరివి గ్రామానికి చెందిన చిన్న మస్తాన్, రమేశ్, తమిళనాడులో నాయుడు కుప్పానికి చెందిన మోహన్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌరబ్‌రాయ్, తడకు చెందిన వాసు మృతి చెందినట్లు అధికారులు వివరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.