నకిరేకల్, అక్టోబర్ 03 : నకిరేకల్ పట్టణంలోని ఏవీఎం పాఠశాలకు చెందిన విద్యార్థులు కట్టంగూర్ మండలం చెరువు అన్నారం జడ్పిహెచ్ఎస్ లో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ అండర్ 14, విభాగాల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ కందాల పాపిరెడ్డి, ప్రిన్సిపల్ కందాల స్వప్న శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అండర్ 14 బాలికల విభాగంలో 9వ తరగతి చదువుతున్న ఎం.చైత్ర రెడ్డి, అండర్ 14 బాలుర విభాగంలో 9వ తరగతి డి.అరవింద్ నాయక్ ఎంపికైనట్లు తెలిపారు. క్రీడాకారులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు నిమ్మల శంకర్ గౌడ్, పూజితను ఉపాధ్యాయ బృందం అభినందించింది.