కుత్బుల్లాపూర్,జనవరి27 : ఆర్థిక ఇబ్బందులకు తోడుగా మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. సీఐ విజయ్‌వర్ధన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీనుబాబు(35) ఉపాధి నిమిత్తం తన కుటుంబంతో కలిసి కొన్నేండ్ల కిందట నగరానికి వలస వచ్చారు. జీడిమెట్ల పరిధి వెన్నెలగడ్డలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తూ కుంటుంబాన్ని పోషిస్తున్నాడు.
కాగా, ఇటీవల తాను ఒక్కడే అదే ప్రాంతంలో మరో రూంలో అద్దెకు ఉంటున్నాడు.
ఇంకా వివాహం కాకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడై మానసిక వేదనతో భాదపడుతూ మద్యానికి బానిసయ్యాడు. సోమవారం అర్ధరాత్రి తాను ఉంటున్న రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీమార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.