కుప్పగండ్ల గ్రామంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జల్లల యాదయ్య పిల్లల చదువు కోసం కుప్పగండ్ల మాజీ సర్పంచ్ మొక్తాల శేఖర్ రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
వడగళ్ల వానతో పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేయాలని బీఆర్ఎస్ నాయకుడు పురుగుల లాలయ్య డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం జారీచేయనున్న రైతు గుర్తింపు కార్డు కోసం మండలంలోని రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ధూళిమిట్ట మండల వ్యవసాయ శాఖ అధికారి అఫ్రోజ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
గాజిరెడ్డిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాయలంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.