చర్లపల్లి, జూలై 4 : ఇంటి నుంచి బయటకు వెళ్లిన గృహిణి, కుతూరు అదృశ్యమైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్‌కు చెందిన కంతిని గోపి తన భార్య గీతతో కలిసి బ్రతుకుదెరువు కోసం కుషాయిగూడ, వాసవిశివనగర్కు వచ్చి నివాసముం టున్నారు. వారికి ఇద్దరు సంతానం. కాగా తరుచూ సంసార విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
గత నెల 22వ తేదిన గోపి బయటకు వెళ్లడంతో అతని భార్య గీత తన కూతూరు వైష్ణవితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. గోపి ఇంటికి వచ్చి చూడగా గీత లేకపొవడంతో వాళ్ల అక్క దగ్గరికి వెళ్లిందని భావించాడు. పది రోజులైన రాకపొవడంతో వాళ్ల అక్క, బంధువులు, స్నేహితుల వద్ద గీత కోసం వాకబు చేసిన ఫలితం లేకపొవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.