Karnataka | పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం.. సిద్ధమవుతున్న కర్ణాటక
Karnataka : పిల్లలు, టీనేజ్ యువత సోషల్ మీడియా వాడకంపై పరిమితులు, నిషేధం విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
Karnataka : చిన్న పిల్లలు, యువత సోషల్ మీడియాను వాడటం వల్ల చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇది వారిపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే పిల్లలు, టీనేజ్ యువత సోషల్ మీడియా వాడకంపై పరిమితులు, నిషేధం విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 ఏళ్లలోపు వారు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకంపై నిషేధం, ఆంక్షలు విధించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ యూనివర్సిటీల్లో 16 ఏళ్లలోపు విద్యార్థులు మొబైల్ వాడకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాంపస్ పరిసరాల్లో వీటి వాడకాన్ని నిషేధించడం లేదా ఆంక్షలు విధించడం చేయాలనుకుంటోంది. ఈ మేరకు దీన్ని అమలు చేసే అంశంపై యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లను సంప్రదిస్తోంది. వారి నుంచి వచ్చే సూచనల్ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటారు. సీఎం సిద్ధరామయ్య ఈ అంశంపై మాట్లాడుతూ విద్యార్థులు, యువత సోషల్ మీడియా ఎక్కువగా వాడుతూ చెడు ప్రభావానికి గురవుతున్నారన్నారు. వారి ప్రవర్తనలో మార్పులు, మానసిక ఇబ్బందులు, చదువులో వెనుకబడిపోవడం వంటివి ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అలాగే ఈ ప్రభావంతో డ్రగ్స్‌కు, సోషల్ మీడియాకు కూడా బానిసలవుతున్నారని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా విద్యార్థులపై ఆంక్షలు విధించే అంశంలో అభిప్రాయాలు చెప్పాలని వీసీలను సీఎం కోరారు. విద్యా సంబంధ అంశాల్లో మొబైల్ వాడకంపై మినహాయింపు ఇస్తూనే, ఆంక్షలు విధించే అంశంపై సూచనల్ని అడిగారు. ఇదే తరహా ప్రతిపాదన ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా చేసింది. సోషల్ మీడియా వాడకంపై వయసు ఆధారంగా పిల్లలకు పరిమితులు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

