మహదేవపూర్, జూలై 4: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ లం అంబటిపల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంత ర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతున్నది.
గురువారం బరాజ్ ఇన్ ఫ్లో 71,900 క్యూసెకుల ఉండగా, శుక్రవారం 84,900 క్యూసెకులకు పెరిగింది. బరాజ్‌లోని మొత్తం 85 గేట్లను ఎత్తి అంతేమొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్‌లో ప్రస్తుత ప్రవాహం రివర్బెడ్ నుంచి సముద్ర మట్టానికి 90.10 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు.