ICC Trophies : ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్(West Indies), ఆస్ట్రేలియా(Australia) ఆధిపత్యం నడిచింది. గత కొంత కాలంగా ఈ రెండు జట్లను దెబ్బకొడుతున్న భారత జట్టు(Team India) వరస టైటిళ్లతో శిఖరాల వైపు దూసుకెళ్తోంది. తాజాగా స్వదేశంలో టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియా.. రికార్డు స్థాయిలో మూడో పొట్టి కప్‌ను పట్టేసింది. మొత్తంగా చూస్తే.. ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్లలో భారత్ ఖాతాలో ఎనిమిదో టైటిల్ చేరింది. అత్యధిక ట్రోఫీలు గెలుపొందిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియా వెనకాలే ఉన్న భారత్.. మరో రెండేళ్లలో ఈ రికార్డును బ్రేక్ చేసిన ఆశ్చర్యమేమీ లేదు.
క్రికెట్ తొలినాళ్లలో వెస్టిండీస్.. ఆస్ట్రేలియా వరుసగా వరల్డ్‌కప్‌లు తన్నుకుపోవడం చూశాం. క్లైవ్ లాయిడ్ (Clive Lloyd) సారథ్యంలో వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌లు గెలుపొందిన విండీస్ ఆట కొన్నాళ్లకు లయ తప్పింది. డారెన్ సమీ (Daren Sammy) కెప్టెన్సీలో రెండుసార్లు పొట్టి ప్రపంచకప్(2012, 2016)ను ముద్దాడిన కరీబియన్ జట్టు ఆ తర్వాత కనుమరుగైంది. మరోవైపు దిగ్గజ ఆటగాళ్లతో కళకళలాడిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ షోతో.. ప్రత్యర్ధి జట్లను బెంబేలెత్తిస్తూ రికార్డు స్థాయిలో ఆరుసార్లు వన్డే ఛాంపియన్‌గా నిలిచింది.
⚡️India are one ICC trophy victory away from matching the tally of the ultimate white-ball royalty 👀 pic.twitter.com/wS2SZBOtMQ
— Cricbuzz (@cricbuzz) March 10, 2026
స్టీవ్ వా, రికీ పాంటింగ్ (Ricky Ponting) .. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆసీస్ తిరుగులేని శక్తిగా అవతరించింది. మూడేళ్ల క్రితం భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ ఆ జట్టు ఖాతాలో చేరిన ఆఖరి వైట్‌బాల్ ఐసీసీ ట్రోఫీ. మరి.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ప్రమాదకరమైన జట్టు హోదా టీమిండియాకే చెందుతుంది. ఎందుకంటే.. గత మూడేళ్ల కాలంలోనే మన జట్టు.. మూడు ఐసీసీ ట్రోఫీలు, ఆసియా కప్‌ను ఒడిసిపట్టింది.
Three legendary Indian men’s team captains in a single frame!
-Kapil Dev: 1983 World Cup 🏆
-M. S. Dhoni: 2007 T20 World Cup, 2011 ODI World Cup 🏆🏆
-Rohit Sharma: 2024 T20 World Cup 🏆
Can Suryakumar Yadav join this list tonight?
📷 Screenshot credit: ICC/Instagram pic.twitter.com/qIzeOoaDZx
— Sportstar (@sportstarweb) March 8, 2026
కపిల్ డెవిల్స్ 1983లో తొలి వరల్డ్‌కప్‌ను దేశానికి అందించగా.. ఎంఎస్ ధోనీ(MS Dhoni) ఆ సంఖ్యను నాలుగుకు పెంచాడు. అతడి హయాంలో 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది భారత్. అనంతరం రోహిత్ శర్మ (Rohit Sharma) ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ 2024లో టీమిండియాను టీ20 వరల్డ్ కప్‌లో.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్‌గా నిలిపాడు.
Gautam Gambhir 🤝 MS Dhoni
T20 World Cup ಗೆದ್ದ Team India ಗೆ MS Dhoni ಅಭಿನಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸಿದ್ದಾರೆ.🙌#T20WorldCup2026Final #T20WorldCup #INDvNZ #TeamIndia #IndianCricketTeam #Champions pic.twitter.com/pmWwSlHUrB
— Star Sports Kannada (@StarSportsKan) March 9, 2026
హిట్‌మ్యాన్, విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికినా.. పొట్టి ఫార్మాట్ కళ తప్పకుండా చూసిన కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) మరో కప్ విజయంలో కీలకమయ్యాడు. రెండేళ్లుగా పొట్టి క్రికెట్లో వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తూ వస్తున్న టీమిండియా.. స్వదేశంలోనూ చెలరేగి ఆడి.. పొట్టికప్‌ను పట్టేసిన మొట్టమొదటి ఆతిథ్య దేశంగా చరిత్రకెక్కింది.
ఇది అంతం కాదు.. ఐసీసీ ఈవెంట్ల దండయాత్రకు కొనసాగింపు అంటున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), కోచ్ గౌతీలు.. వచ్చే వన్డే వరల్డ్‌కప్, ఒలింపిక్‌లో స్వర్ణ పతకం, 2028 పొట్టి కప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. టీ20ల గతిని మార్చిన ఐపీఎల్ (IPL) ఆగమనంతో భయమంటే ఏంటో తెలియని ఆటతో కుర్రాళ్లు రెచ్చిపోతున్నారు. అత్యంత సంపన్నమైన బీసీసీఐ అండదండలు.. ప్రేక్షకుల నీరాజనాల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలుతున్న టీమిండియా.. వచ్చే రెండేళ్లలో అత్యధిక ఐసీసీ టైటిళ్ల విజేతగా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పడం ఖాయం.
🔹 2016 T20 World Cup 🔹 (3/n)
Jason Roy 🏴, Quinton de Kock (wk) 🇿🇦 , Virat Kohli (C) 🇮🇳, Joe Root 🏴, Jos Buttler 🏴, Shane Watson 🇦🇺, Andre Russell 🌴, Mitchell Santner 🇳🇿, David Willey 🏴, Samuel Badree 🌴, Ashish Nehra 🇮🇳, Mustafizur Rahman (12th) 🇧🇩
📷 ICC pic.twitter.com/brILSmxRYq
— CricketGully (@thecricketgully) March 10, 2026
ఇప్పటివరకూ వైట్‌బాల్ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆరు వన్డే ప్రపంచకప్‌లు ఒక టీ20 వరల్డ్‌కప్, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించింది. భారత్ విషయానికొస్తే.. రెండు వన్డే వరల్డ్‌కప్(1983, 2011)లు, మూడేసీ పర్యాయాలు టీ20 ఛాంపియన్(2007, 2024, 2026), చాంపియన్స్ ట్రోఫీ(2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా, 2013, 2025) విజేతగా నిలిచింది.
🔹 2022 T20 World Cup 🔹 (5/n)
Alex Hales 🏴, Jos Buttler (C & wk) 🏴, Virat Kohli 🇮🇳, Suryakumar Yadav 🇮🇳, Glenn Phillips 🇳🇿, Sikandar Raza 🇿🇼, Shadab Khan 🇵🇰, Sam Curran 🏴, Anrich Nortje 🇿🇦, Mark Wood 🏴, Shaheen Afridi 🇵🇰, Hardik Pandya (12th) 🇮🇳
📷 Associated Press pic.twitter.com/9yADWoAyma
— CricketGully (@thecricketgully) March 10, 2026
ఐదు ఐసీసీ టైటిళ్ల (రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టీ20 ట్రోఫీలు, ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేత)తో వెస్టిండీస్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక మూడేసీ ఐసీసీ టైటిళ్లు మాత్రమే గెలుపొందాయి.