తెలుగు యూనివర్సిటీ, జూలై 4 : తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ విద్యార్థి ప్రభాకర్ జైనికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పురస్కారాన్ని అందించిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు వర్సిటీ రంగస్థలం కళల శాఖ ఆధ్వర్యంలో వర్సిటీ సమావేశ మందిరంలో అభినందన సభ శుక్రవారం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్ డి వేముల శ్రీనివాసులు, తెలుగు వర్సిటీ వి.సి నిత్యానందరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, సినీ రచయిత కె ఎల్ ప్రసాద్, ఆచార్య పద్మప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రంగాలలో సృజనాత్మకత కలిగిన వ్యక్తి ప్రభాకర్ జైనీ అని ప్రశంసించారు.