కొమురవెల్లి మల్లన్నకు కోటిదండాలు
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.ఆలయంలో మల్లన్న దర్శనంతో భక్తులు పరవశించిపోయారు.స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు “మల్లన్న స్వామి .. మమ్మేలు స్వామి, కొమురవెల్లి మల్లన్న కోటి దందాలు” అనే నినాదాలతో మల్లన్న క్షేత్రం మార్మోగింది.
- ఎనిమిదో ఆదివారానికి భారీగా తరలివచ్చిన జనం
- మొక్కులు చెల్లించుకున్న భక్తులు
చేర్యాల, మార్చి 8 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.ఆలయంలో మల్లన్న దర్శనంతో భక్తులు పరవశించిపోయారు.స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు “మల్లన్న స్వామి .. మమ్మేలు స్వామి, కొమురవెల్లి మల్లన్న కోటి దందాలు” అనే నినాదాలతో మల్లన్న క్షేత్రం మార్మోగింది. ఎనిమిదో ఆదివారం సందర్భంగా 50వేల మందికి పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయ నిర్వహణలో ఉన్న గదులు, ప్రైవేట్ గదులు అద్డెకు తీసుకుని బసచేశారు.
శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్రలేచి గదుల్లో పవిత్రస్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలో నాలుగు గంటల పాటు వేచి ఉన్నారు. ధర్మదర్శనానికి రెండుగంటలు, శీఘ్రదర్శనానికి మూడున్నర గంటలు, వీవీఐపీ దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బసచేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు.
మరికొందరు గంగరేగుచెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు స్వామివారికి ఒడిబియ్యం, అభిషేకం, అర్చన, బోనాలు తదితర పూజలు నిర్వహించారు.ఆలయ ఏఈవోలు రావుల సుదర్శన్, బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకుడు నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఉత్సవ కమిటీ సభ్యులు, సిబ్బంది,అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో చేర్యాల సీఐ రమేశ్, ఎస్సై మహేశ్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AI Technology | చాట్జీపీటీతో అద్భుతం.. రెండున్నరేళ్ల తర్వాత భర్త చెంతకు చేరిన తప్పిపోయిన భార్య!
Sabarimala | శబరిమల ప్రసాదం ఇంటికే డెలివరీ
Ramayana | రామాయణ బాక్సాఫీస్ విధ్వంసం.. 10వ రోజు కూడా తగ్గని జోరు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,228 కోట్ల వసూళ్లు!
Bhushan Bara | చదివిస్తానని ఇంటికి తెచ్చి కడుపు చేసిన ఎమ్మెల్యే.. జార్ఖండ్లో గిరిజన బాలికపై ఘాతుకం!
Promotions | ఏవో టు ఏడీ ఉద్యోగోన్నతుల్లో గోల్మాల్.. డీహెచ్లో ఇద్దరు ఏడీల దందా!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

