చండూరు : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు పట్టణ కేంద్రంలోని
శ్రీ మార్కండేశ్వర స్వామి జాతర ( Markandeya Swamy Jatara ) ను ఘనంగా నిర్వహించారు. ఆదివారం విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచనము, అంకురార్పణ, మంటపారాధన, అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణ నిర్వహించారు.

స్వామి, అమ్మవార్ల కళ్యాణ మహోత్సవమునకు పచ్చటి తోరణం, వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన నంది శకటము (ఎడ్ల బండి)పై మగ్గమును ఏర్పాటుచేసి, పట్టు వస్త్రాలను తయారుచేసి ఆనవాయితీని చండూరు చేనేత కళాకారులు కొనసాగించారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు.
సాయంత్రం హోమము, బలిహరణ, భేరి పూజలు చేపట్టారు. ఆదివారం రాత్రి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం, ఈనెల 25న విమాన రథోత్సవం, 26 న అగ్నిగుండాలు, 28న శ్రీ భూ,నీలాసమేత వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణము జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు .