Ramesh | ‘గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ఐసీయూలో చికిత్స, అభిమానుల్లో ఆందోళన
Ramesh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్ లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన నటుడు గబ్బర్ సింగ్ రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను అత్యవసరంగా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో నిపుణుల వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ వార్త తెలిసిన సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Ramesh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్ లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన నటుడు గబ్బర్ సింగ్ రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను అత్యవసరంగా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో నిపుణుల వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ వార్త తెలిసిన సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ప్రకారం, రమేష్ ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు నిర్ధారణ కావడంతో అత్యవసర చికిత్స ప్రారంభించారు.
ప్రస్తుతం న్యూరాలజీ నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ, వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. 2012లో విడుదలైన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అంత్యాక్షరి గ్యాంగ్‌లో సభ్యుడిగా నటించిన రమేష్ తన హాస్యభరితమైన హావభావాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సినిమా ఘన విజయం సాధించడంతో “గబ్బర్ సింగ్ రమేష్”గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ సినిమాలోని కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ‘గబ్బర్ సింగ్’ విజయానంతరం రమేష్‌కు టాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్య వస్తావయ్యా’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. షూటింగ్‌లకు సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేవారు.
సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతో రమేష్ రాజకీయాల్లో కూడా చురుకుగా కనిపించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొని పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని అంత్యాక్షరి గ్యాంగ్ సభ్యులు కూడా ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.రమేష్ అనారోగ్య వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, సహనటులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి మళ్లీ ప్రేక్షకులను తన నటనతో అలరించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

