Iran | అమెరికాలో 9/11 తరహా దాడులు చేస్తాం.. ట్రంప్‌కు ఇరాన్ మాస్ వార్నింగ్
Iran | ఇరాన్ కాల్పులు జరిపిన ప్రతిసారి ఆ దేశంలోని వంతెన పైనో, విద్యుత్తు ప్లాంట్ పైనో దాడి చేసి దానిని నాశనం చేస్తామని అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్(Iran )కూడా ఘాటుగా స్పందించింది.
ఇరాన్ : హొర్ముజ్ జలసంధిలోని(Strait of Hormuz) నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపిన ప్రతిసారి ఆ దేశంలోని వంతెన పైనో, విద్యుత్తు ప్లాంట్ పైనో దాడి చేసి దానిని నాశనం చేస్తామని అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్(Iran )కూడా ఘాటుగా స్పందించింది. అమెరికాలో 9/11 తరహా దాడులు చేస్తామని ఆ దేశానికి టెహ్రాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం కొనసాగితే అమెరికాలో జాతీయ సంతాప దినాలు చేసుకోవాల్సి ఉంటుందని, అమెరికా ఇంధన కేంద్రాలు, వంతెనలు లక్ష్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. తమ సూచనలు పాటించిన నౌకలకు మాత్రమే హర్మూజ్‌లో సురక్షిత ప్రయాణానికి అవకాశం ఉంటుందని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సంస్థ తస్నిమ్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా, హొర్ముజ్ జలసంధిలోని నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపిన ప్రతిసారి ఆ దేశంలోని వంతెన పైనో, విద్యుత్తు ప్లాంట్ పైనో దాడి చేసి దానిని నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ డ్రోన్ ద్వారా దాడి చేసిందా, క్షిపణి ద్వారా చేసిందా అన్నది ముఖ్యం కాదని, ఎలా దాడి చేసినా ఇరాన్ రాజధాని సమీపంలోని వంతెన, విద్యుత్తు ప్లాంట్లపై ఆమెరికా బాంబులు వేయడం, వాటిని నాశనం చేయడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌పై తమ దాడులు ఇంకా ముగియలేదన్నారు. అయితే ఇప్పుడు దాడులు ఆపేసినా ఈ యుద్ధం నుంచి తేరుకోవడానికి, దేశ పునర్ నిర్మాణానికి ఇరాన్‌కు 20 ఏండ్లకు పైగా సమయం పడుతుందని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

