జిన్నారం, జూలై 4: పాశమైలారం పార్రిశామికవాడలోని సిగాచి పర్రిశమ పేలుడు ఘటనలో మృతిచెందిన కార్మికులకు నివాళులర్పిస్తూ బొల్లారం మున్సిపాలిటీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తా నుంచి పాత హనుమాన్ ఆలయం వరకు సంఘ సేవకులు ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
విషాదకరమైన ఈ సంఘటనలో మృతిచెందిన 39 మంది కార్మికులకు కొవ్వొత్తులతో నివాళులు ఘటించారు. మృతుల కుటుంబీకులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాధించాలని సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్య్రకమంలో స్థానిక నాయకులు, మున్సిపల్ వాసులు పాల్గొన్నారు.