గర్భిణులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వంగర ప్రభుత్వ వైద్యాధికారి రుబీనా తెలిపారు. గురువారం వంగర ప్రభుత్వ దవాఖానలో గర్భిణులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పని చేయాలని క్లస్టర్ ఇన్చార్జి నాయకులు గద్దల నరసింహారావు, పెద్ది రాజు రెడ్డి కొమ్మురాజు, ముస్త్యాల దయాకర్, మజీద్, రెహమాన్ అన్నారు.
పెద్దపల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి సింగరేణి కార్మికులు, పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు పిలుపునిచ్చారు.
పంటల సాగుకు సహకార సంఘం ద్వారా పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండలం లింగాపుర్ గ్రామ రైతులు మంగళవారం కొత్తపల్లి సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు.