కుభీర్, ఆగస్టు 08: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని రంగశివిని గ్రామనికి చెందిన పవార్ సచిన్ (32) గురువారం సాయంత్రం పార్డి బి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కుభీర్ ఎస్ఐ ఏ కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సచిన్ తన స్వగ్రామం నుండి బైక్ పై కుభీర్ సంతకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో పార్డి(బి) గ్రామ సమీపంలో అడవి పంది అడ్డం రావడంతో అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొన్నాడు. దీంతో ఆయన తలకు బలమైన గాయాలు కాగా తీవ్ర రక్తస్రావం అయింది. క్షతగాత్రుడిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.