తిరుపతి : టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.70 లక్షలు విరాళంగా ( Donations ) అందింది. నెల్లూరు జిల్లాకు చెందిన శంకర్ ఎంటర్ ప్రైజెస్ అధినేత జయశేఖర్ రూ.10 లక్షలు, చిత్తూరుకు చెందిన బాలాజీ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ రమేష్‌బాబు రూ.10 లక్షలు, వినాయక ఫౌల్ట్రీఫాం అధినేత రాధ శ్రీనివాసులు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
చిత్తూరు జిల్లా కొటార్లపల్లికి చెందిన మంజునాథ్ రూ.10 లక్షలు, శ్రీవారి ఫౌల్ట్రీఫాం అధినేత హేమాద్రి రూ.10 లక్షలు, ఫౌల్ట్రీఫాం అధినేత రవికుమార్ రూ.10 లక్షలు, పలమనేరుకు చెందిన ఎస్ఆర్ఎస్ ఎంటర్ ప్రైజెస్ అధినేత పురుషోత్తం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు విరాళం డీడీలను తిరుపతిలోని ఈవో బంగ్లాలలో టీటీడీ ఈవో ఎం.రవిచంద్రకు అందజేశారు.