రాయపోల్ : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం (Mega Health Camp) నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో మొత్తం 127 మంది వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న వారు పరీక్షలు చేయించుకున్నారు.
స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ లుబనా, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నరేష్ , కంటివైద్య నిపుణులు డాక్టర్ కావ్య, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ షేఫిన్, దంత వైద్య నిపుణులు డాక్టర్ ప్రసాద్ , సాధారణ వైద్య నిపుణులు డాక్టర్ రేష్మి వైద్య పరీక్షలు నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మహారాజ్ , ప్రాథమిక వైద్య సిబ్బంది శ్రీనివాస్ , హెల్త్ సూపర్వైజర్ వినోద ,స్టాఫ్ నర్సులు మంజు, నీరజ, ఫార్మాసిస్ట్ మోహన్ రావు , శ్రీలత ల్యాబ్ టెక్నీషియన్, యునాని సిబ్బంది డాక్టర్ ఫిర్ దౌసి , లింగం ఫార్మాసిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.