iQOO Z11x 5G | ఐకూ జడ్11ఎక్స్ 5జీ ఫోన్ విడుదల.. 7,200 ఏంఏహెచ్ బ్యాటరీ.. ధర, ఫీచర్లివే
iQOO Z11x 5G : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఐకూ మీడియం బడ్జెట్ రేంజ్లో ఐకూ జడ్11ఎక్స్ పేరుతో 5జీ ఫోన్‌ను ఇటీవల లాంఛ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐకూ జడ్ 10 ఎక్స్ మొబైల్‌కు ఇది తర్వాతి వెర్షన్ ఫోన్.
iQOO Z11x 5G : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఐకూ మీడియం బడ్జెట్ రేంజ్లో ఐకూ జడ్11ఎక్స్ పేరుతో 5జీ ఫోన్‌ను ఇటీవల లాంఛ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐకూ జడ్ 10 ఎక్స్ మొబైల్‌కు ఇది తర్వాతి వెర్షన్ ఫోన్. 7,200 ఏంఏహెచ్ కెపాసిటీ కలిగిన పవర్ఫుల్ బ్యాటరీ దీని ప్రత్యేకత. చిప్సెట్, కెమెరాల్లో కూడా అప్డేట్ చేశారు.
\ఐకూ జడ్11ఎక్స్ 5జీ ఫోన్ ప్రధాన ఫీచర్లు, ధరల వివరాలివి. 6.76 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డిమెన్సిటీ 7,400 చిప్సెట్, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ బేస్డ్ ఒరిజిన్ ఓఎస్ 6.0, రెండేళ్లపాటు ఓఎస్ అప్డేట్స్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, 50 ఎంపీ సోనీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ బొకే కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 219 గ్రాముల బరువు, 7,200 ఏంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ వంటివి ప్రధాన ఫీచర్లు.
ప్రిస్మాటిక్ గ్రీన్, టైటాన్ బ్లూ కలర్స్‌లో లభ్యం. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.18,999/ రూ.20,999 / రూ22,999. కొన్ని బ్యాంకులపై రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అమెజాన్‌తోపాటు ఐకూ సైట్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Amazon
- features
- India
- iQOO Z11x 5G
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

