హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 8: హనుమకొండ జిల్లా స్కూల్ గేమ్స్సెక్రటరీగా వెలిశెట్టి ప్రశాంత్‌కుమార్‌ను డీఈవో డి.వాసంతి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రశాంత్‌కుమార్ ప్రస్తుతం కాజీపేట తరాలపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ ఎస్ఏ(ఫిజికల్ ఎడ్యుకేషన్)గా పనిచేస్తున్నారు. ఈ పదవీలో రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ ఎంపిక చేసినందుకు డీఈవోకు, సహకరించిన హనుమకొండ జిల్లా వివిధ ఉపాధ్యాయ సంఘాలు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రెండు సంవత్సరాలు ఎస్జీఎఫ్ఐ హనుమకొండ గేమ్స్‌ను తనకున్న అనుభవంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీజీ టీఈటీఏ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శీలం పార్థసారథి, జనరల్ సెక్రెటరీ కె.మల్లారెడ్డి, పీడీలు సీహెచ్ వెంకటేశ్వర్లు, ఎం.కరుణాకర్, ఆర్.సుభాష్, ఎం.సురేష్, వి.నాగరాజు, బి.రాజు పాల్గొని ప్రశాంత్‌కుమార్‌ను అభినందించారు.