భువనేశ్వర్:హాకీ ఇండియా లీగ్(హెచ్ఐఎల్)లో హైదరాబాద్ తుఫాన్స్ దుమ్మురేపింది. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ 6-0 తేడాతో బెంగాల్ టైగర్స్‌పై ఘన విజయం సాధించింది. ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్..బెంగాల్‌ను చిత్తుగా ఓడించింది.
హైదరాబాద్ తుఫాన్స్ తరఫున జాచ్రెరె వాలెస్(2ని, 17ని, 30ని), టిమ్ బ్రాండ్(12ని, 39ని, 46ని) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగారు. మ్యాచ్ మొదలైన రెండో నిమిషంలోనే హైదరాబాద్ గోల్ ఖాతా తెరిచింది. వాలెస్ గోల్‌తో ఆధిక్యంలోకి వచ్చిన హైదరాబాద్ మ్యాచ్ ఆసాంతం అదే జోరు కొనసాగించింది.