Party Defected MLAs Case | ఇక దానం, కడియం వంతు!.. 27, 28 తేదీల్లో ఆ ఇద్దరి విచారణ
Party Defected MLAs Case | తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకొన్నది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపేందుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మంగళవారం షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
Party Defected MLAs Case | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకొన్నది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపేందుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మంగళవారం షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణకు తమ వాదనలను వినిపించడంతోపాటు సాక్ష్యాధారాలను సమర్పించాల్సి ఉంటుందని షెడ్యూల్లో పేర్కొన్నారు. స్పీకర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఎదుట పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అడిగే ప్రశ్నలకు దానం, కడియం సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నిరూపించుకోవడానికి అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. గత నెల 18న ఈ కేసులో పిటిషనర్ పాడి కౌశిక్‌రెడ్డిని దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. 19న కడియం తరఫు లాయర్లు వివేకానందగౌడ్‌ను ప్రశ్నించారు.
27న దానం.. 28న కడియం
స్పీకర్ జారీచేసిన విచారణ షెడ్యూల్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 27వ తేదీన ఉదయం 11:00 గంటలకు విచారణ ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 12:00 గంటలకు విచారణ చేపడుతారు. 28వ తేదీన ఉదయం 11:00 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఉంటుంది. ప్రతివాది స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున సాక్ష్యాధారాలను సేకరిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Case
- Congress
- Danam Nagender
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

