Harish Rao | వరంగల్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గోదావరి నదీ జలాల వినియోగంపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. రెండు రోజుల క్రితం దేవాదుల వేదికగా సీఎం రేవంత్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని ప్రకటించారు.
‘గోదావరి మీద చర్చకు మేం సిద్ధం. ఎంత సేపన్నా మాట్లాడుదాం. ఎన్ని రోజులైనా మాట్లాడ్తాం. కానీ, కెమెరా తిప్పొద్దు. మైక్ కట్ చేయొద్దు. అందుకు నువ్వు సిద్ధమా’ అని హరీశ్‌రావు సీఎం రేవంత్‌కు ప్రతిసవాల్ విసిరారు. వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ దవాఖానను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాసర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్, పార్టీ నేతలు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్లు సాంబారి సమ్మారావు, సుధీర్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్‌యాదవ్, టీ రమేశ్‌బాబు, హరిరమాదేవి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నదీ జలాలపై రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు ప్రత్యేకించి నీటివాటాపై రేవంత్‌రెడ్డి నేరపూరిత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు.
రైతుల పంట పొలాలకు కేసీఆర్ నీళ్లు పారించడం ప్యాషన్ అయితే, దురదృష్టవశా త్తు రైతుల కండ్లల్లో నీళ్లు పారించడం రేవంత్‌కు ప్యాషన్ అయిపోయిందంటూ హరీశ్‌రావు ధ్వ జమెత్తారు. దేవాదుల ఇన్‌టెక్ వెల్, దేవన్నపేట పంప్‌హౌస్‌ల్లో ఏం జరుగుతున్నదో బీఆర్ఎస్ అప్రమత్తం చేసేదాకా రేవంత్ సర్కార్ మొద్దునిద్ర వీడలేదని ఎద్దేవా చేశారు. దేవాదులలో 10 పంపులకు ఆరే నడుస్తున్నాయని, దేవన్నపేటలో మూడు పంప్‌లకు మూడు పనిచేయడం లేదని తాము చెప్పేదాకా రేవంత్‌కు తెలియకపోవడం దారుణమని మండిపడ్డారు. తమ దెబ్బకు మరుసటి రోజే సీఎం హడావిడిగా గోదావరి బాటపట్టి అన్ని మోటర్లు నడుపాలని ఆదేశించారని పేర్కొన్నారు.
దేవాదుల విషయంలో డెడ్లైన్లు మారుతున్నాయే తప్ప ప్రాజెక్టు పూర్తి కావడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో దేవాదుల ప్రాజెక్టుకు రూ.7,300 కోట్లు ఖర్చుచేసి 90% పనులు పూర్తి చేసి 3.20లక్షల ఎకరాలకు నీరందించామని గుర్తుచేశారు. వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే, నీటి పారుదల శాఖ ఉత్తమ్ 2027 మార్చి అని, సీఎం రేవంత్ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని కొత్త డెడ్‌లైన్ పెట్టారని, రోజుకో డేట్ మార్చుతున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ చంద్రబాబుకు ఎలా దా సోహం అయ్యారో బయటపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. గోదావరి జలాల వినియోగం విషయం లో 60ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన మోసా న్ని అసెంబ్లీ వేదికగా ఎండగడ్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో అనేక బరాజ్‌లు నిర్మించి గోదావరి నదిని 312 కి.మీ మేర నిండుకుండలా మార్చి ఎలా జీవనదిలా తీర్చిదిద్దిందో కూడా వివరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో గోదావరి మీద ఒక ప్రాజెక్టు అయినా కట్టిందా? కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో 48 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించామని, అదే రెండున్నరేండ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా అదనంగా నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరువు తీశారని హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం దేవాదులలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరిస్తే సీఎం వారించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేవాదుల ప్రాజెక్టు మీద కడియం శ్రీహరికి చాలా అవగాహన ఉన్నదని, ఈసారి రివ్యూ చేస్తే శ్రీహరిని పిలుచుకోమని చెప్పడం అంటే నీళ్ల మంత్రికి ఏం తెల్వదని సీఎం చెప్పకనే చెప్పి దేవాదుల సాక్షిగా ఉత్తమ్ ఇజ్జత్ తీశారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ వేదికగా పారదర్శకంగా చర్చిస్తే.. ఎవరేం చేశారో ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని, అంతిమంగా ప్రజలే న్యాయనిర్ణేతలని తెలిపారు.
రెండున్నరేండ్లు అయినా జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వరా అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. జర్నలిస్టులు ఏం పాపం చేశారని ఈహెచ్ఎస్ స్కీమ్ నుంచి జర్నలిస్టులను తొలగించార ని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్సీమ్ అమలు చేసిందని, ఉద్యోగు లు చెల్లించిన వాటాను కూడా జర్నలిస్టు లు చెల్లించకుండా కేసీఆర్ జాగ్రత్త తీసుకు న్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జర్నలిస్టులకు కూడా ఈహెచ్ఎస్ మాదిరే జేహెచ్ఎస్ను అమలుచేయాలని డిమాం డ్ చేశారు. జర్నలిస్టులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 100 కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది, రూ.50 కోట్లతో తెలంగాణ మీ డియా అకాడమీ భవనాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని వివరించారు.
సీఎం రేవంత్‌కు ఫ్యూచర్‌సిటీపై ఉన్న ప్రేమ హెల్త్సిటీపై లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో వరంగల్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌కు 24 అంతస్తు ల స్లాబ్‌లు వేస్తే రేవంత్సర్కార్కు కనీసం ఫినిషింగ్ వర్క్ పూర్తి చేయడం చేతకావడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూచర్‌సిటీకి పెట్టిన శ్రద్ధలో కనీసం పదో వంతు హెల్త్‌సిటీ మీద పెడితే స్పెషాలిటీ పనులు ఎప్పుడో పూర్తయ్యేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పడి ఉంటే 2024 దసరా నాటికే దవాఖాన అందుబాటులోకి వచ్చేదని చెప్పారు. ఇప్పటికైనా త్వరగా పూర్తి చేసి వైద్య సేవలు అం దుబాటులోకి తేవాలని లేకపోతే ఇదే వరంగల్ గడ్డమీద నిరాహార దీక్షలు చేస్తామంటూ హెచ్చరించారు. మంగళవారం వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను హరీశ్ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు ప్రజారోగ్యంపై శ్రద్ధ ఉంటే రేవంత్‌రెడ్డికి ఫ్యూచర్ సిటీ ద్వారా జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదే ఆసక్తి ఎక్కువని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు పేరొస్తుందనే అక్కసుతో రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా హాస్పిటల్ డిజైన్లు మార్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ ఎంజీఎంలో 250 గుండె ఆపరేషన్లు జరిగాయని, దురదృష్టవశాత్తు అదే దవాఖాన ఇవాళ ఎలుకలు, పందికొక్కులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మైసయ్య డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయిన వైనాన్ని ఉదహరిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీంగా ఉందన్నారు.
దేవాదులను తొక్కిపెట్టి.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, సమ్మక్క బరాజ్‌లను ఎండబెట్టి రేవంత్ సర్కార్ ఆంధ్రాకు నీళ్లు ఎలా వదులుతున్నదో.. నల్లమలసాగర్‌ను చంద్రబాబుకు ఎలా దాసోహం చేస్తున్నదో అన్నీ బయటపెడ్తం. గోదావరి జలాల వినియోగం విషయంలో 60ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన మోసాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగడ్తం. అలాగే కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో వివరిస్తాం. – హరీశ్‌రావు
దేవాదుల ప్రాజెక్టుపై మొన్న వరంగల్‌లో నీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే నువ్వు మాట్లాడనీయలేదు. రేపు అసెంబ్లీలో మైక్ ఇస్తవా? మమ్మల్ని మాట్లాడనిస్తవా? కెమెరా తిప్ప.. మైక్ కట్ చేయను అనే షరతుకు ఒప్పుకొంటే గోదావరి నదీ జలాల వినియోగంపై మేము ఎంత సేపైనా, ఎన్ని రోజులైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నం.
నీ సవాల్‌కు మేం రెడీ. నువ్వు సిద్ధమా? – హరీశ్‌రావు