లగచర్ల పోరాట యోధురాలు జ్యోతి కుమార్తె భూమి నాయక్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ భవన్లో చిన్నారి మొదటి పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా కేటీఆర్ హాజరై కేక్ కట్ చేశారు. నిండు గర్భిణిగా ఉన్న సమయంలో భూముల పరిరక్షణకు పోరాటం చేసిన లంబాడీ ఆడబిడ్డ జ్యోతినాయక్కు నిరుడు కూతురు జన్మించగా కేటీఆర్ నాటి పోరాటానికి గుర్తుగా భూమినాయక్గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.
– హైదరాబాద్, నమస్తేతెలంగాణ