మెదక్ రూరల్ ఆగస్టు 08 : ఎరువులు కుత్రిమ కొరత సృష్టించద్దని,డిమాండ్‌కు అనుగుణంగా నిలువలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఆగ్రో రైతు సేవా కేంద్రంను కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా ఉన్న నిలువలను పరిశీలించారు. స్టాక్ వివరాలను, ఆన్లైన్ తదితర వివరాలను డీలర్లు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సీజన్‌కు అనుగుణంగా జిల్లాలో తగినన్ని ఎరువులు, విత్తనాలు ఉన్నాయని కొంతమంది కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులతో స్వయంగా మాట్లాడుతూ వారికి కావాల్సిన సమాచారాన్ని అందించారు. కల్తీ విత్తనాలు అమ్మిన, అధిక ధరలకు విక్రయించిన, ప్రభుత్వం సూచించిన ప్రకారం సంబంధిత వ్యక్తులపై శాఖపరమైన చర్యలు తీసుకుని లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది క్రమం తప్పకుండా సంబంధిత అధికారులతో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.