కీసర, ఆగస్టు 8 : వచ్చేది తెలంగాణలో మన రాజ్యమేనని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు. దమ్మాయిగూడ మున్సిపాల్టీ పరిధి కీసర మండల బీఆర్ఎస్ నేతలు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని కలిసి మున్సిపాల్టీలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం చర్చించారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమక్షంలో కీసరగుట్ట మాజీ ట్రస్టుబోర్డు సభ్యులు రాగుల రమేశ్ ముదిరాజ్ జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. రమేశ్‌ను ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మల్లాడుతూ ప్రజలంతా కాంగ్రెస్ పాలనకు విసిగెత్తి పోతున్నారని, తెలంగాణలో వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, కార్యకర్తల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, నేతలు రాగుల రమేశ్ ముదిరాజ్, చినింగని బాల్‌రాజ్, తుడుం ఆగమయ్య, పండుగ రాజలింగం, భాస్కర్, ముత్యాలు, ఎర్సీఎం ప్రకాష్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.