నల్లగొండ, మార్చి 12 : లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఎలైట్ ఆధ్వర్యంలో అద్దంకి లక్ష్మమ్మ జ్ఞాపకార్ధం వారి కుమారుడు అద్దంకి సునీల్ నల్లగొండ జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం ఏబీసీడీ క్యాంపస్ పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ నాయకులు మాట్లాడుతూ.. పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఎలైట్ సభ్యులు ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, రామకృష్ణ, అద్దంకి సునీల్, నల్లగొండ ఏఎస్డబ్ల్యూఓ స్వామి, హెచ్డబ్ల్యూఓస్ విజయలక్ష్మి, స్వప్న, దూసరి భారతమ్మ, తయాబా పాల్గొన్నారు.