కనగల్, ఆగస్టు 15 : కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామ ఉప సర్పంచ్ కొమ్మగోని జానకమ్మ పాపయ్య శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్ సహకారంతో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టిగుండ్ల గిరి ప్రసాద్, జినుకుంట్ల నరసింహ, జినకుంట్ల అంజయ్య, బోధనపు శ్రీనివాస్ రెడ్డి, చాడ సైదులు, చిదెటి నవీన్ రెడ్డి, పాలకూరీ రాజు, కడమంచి ఎల్లయ్య, పర్వతం వెంకన్న, జినుకుంట్ల లింగస్వామి, నాగోజు నాగచారి, జినకుంట్ల సాయి తేజ పాల్గొన్నారు.