Vivo Y51 Pro : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో మీడియం రేంజ్ బడ్జెట్లో కొత్త 5జీ ఫోన్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గత ఏడాది విడుదలైన వివో వై 31కు తర్వాతి వెర్షన్ ఫోన్‌గా పరిగణించవచ్చు. భారీ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటివి ప్రధాన ఫీచర్లు. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి.
ఆండ్రాయిడ్ 16 ఓఎస్, ఒరిజిన్ ఓఎస్ 6, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, మిడియాటెక్ డిమెన్సిటీ 7360 చిప్సెట్, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ, 6.75 అంగుళాల హెచ్డీ+ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 1,250 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఏఐ ఫీచర్స్, 219 గ్రాముల బరువు, 2 నానో సిమ్స్, 50 ఎంపీ+2ఎంపీ మెయిన్ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 400 పర్సంట్ వాల్యూమ్ బూస్ట్ వంటి ఫీచర్లున్నాయి.
ఫెస్టివ్ రెడ్, నోబుల్ గోల్డ్ కలర్స్‌లో లభిస్తుంది. దీని ధరలు రూ.24,999/రూ.27,999. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది. వివిధ కార్డులపై డిస్కౌంట్స్ వర్తిస్తాయి.