కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 8 : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధపాలన విధానాలతో నిరుపేదలు బతికే పరిస్థితులు లేకుండా పోయిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో జూబ్లీహిల్స్ నియోజవర్గం ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఎమ్మెల్యే కృష్ణారావు సమావేశం నిర్విహించి బూత్‌స్థాయి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అన్ని రంగాలలో నెంబర్‌వన్‌గా అభివృద్ధిని సాధించిందన్నారు.
కానీ, నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విధానలతో నిరుపేదలు అవస్థలు పడుతున్నారని, చిరువ్యాపారుల నుంచి బడా వ్యాపారాలు దెబ్బతిన్నాయన్నారు. కాలనీలు, బస్తీలలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా పూర్తిగా విఫలమౌతున్నారన్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నాయకత్వంలో జూబ్లీహిల్స్ అదర్శవంతంగా అభివృద్ధి చెందిందని, ఆయన ఆకాల మరణం తీరనీలోటన్నారు. ఈ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ను గెలిపించడమే మాగంటికి నిజమైన నివాళి అని అన్నారు.
కార్యక్రమంలో కోఅర్డినేటర్ సతీష్ఆరోరా, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, ముద్దం నర్సింహాయాదవ్, ఆవుల రవీందర్‌రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, పండాల సతీష్‌గౌడ్, పగుడాల శిరీషాబాబురావు, మహేశ్వరిశ్రీహరి, సబీహాగౌసుద్థీన్, మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబురావు, తూము శ్రావణ్‌కుమార్, జిల్లా మైనార్టి అధ్యక్షుడు గౌసుద్ధీన్, ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ, షరీఫ్కురుసీ, జావిద్, అజీముద్ధిన్, సయ్యద్స్రూల్, బాలు, నర్సింగరావు, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, బద్రీద్ధున్, భుజంగరావు, శ్రీకాంత్, తరుణ్, రవి, జవహార్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.