కొత్తగూడ, ఆగస్టు 8 : మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరించడం స్థానికంగా కలకలం రేపుతున్నది. కొత్తగూడ మండలంలోని జంగవానిగూడెం సమీప అడవుల్లో ఆవును పెద్దపులి మాటువేసి చంపినట్లు అటవీశాఖ అధికారులు వజహత్ తెలిపారు. పశువుల కాపరి సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని పులి అడుగులుగా గుర్తించారు.
సమీప అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు ధ్రువీకరిండంతో ఏజెన్సీలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, అడవుల్లోకి ఎవరూ వెళ్లొద్దని అటవీ శాఖఅధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, మృతిచెందిన ఆవుకు కొత్తగూడ పశువైద్యాధికారితో పంచనామా నిర్వహించారు.