చుంచుపల్లి, మార్చి 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యుత్ కార్యాలయంలో ఏఈ నరసింహారావు ఆధ్వర్యంలో లైన్‌మ్యాన్ దివాస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యుత్ రంగంలో ప్రాణాలకు తెగించి నిరంతరం సేవలు అందిస్తున్న ఫ్రంట్‌లైన్ యోధులైన లైన్మెన్ల సేవలను గుర్తించి వారిని గౌరవించడం లైన్‌మ్యాన్ దివాస్ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఈ రంగస్వామి, ఏడీఈ హేమచంద్రబాబు హాజరై మాట్లాడారు. ప్రతి లైన్‌మ్యాన్ నిత్యం భద్రతా పరికరాలు ఉపయోగించుకుంటూ సురక్షితంగా పని చేయాలని సూచించారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు లైన్మెన్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అనంతరం పలువురు విద్యుత్ ఉద్యోగులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కత్తి శీను, జగదీష్ బాబు, జి.శ్రీను, పి.రఘు, జి.సాంబశివరావు, టి.కిషన్ పాల్గొన్నారు.