F-35B Stealth Fighter: అమెరికాలో కూలిన ఎఫ్-35బీ స్టీల్త్ ఫైటర్ విమానం.. వీడియో
F-35B Stealth Fighter: అమెరికాలో ఎఫ్-35బీ స్టీల్త్ ఫైటర్ విమానం కూలింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. శాన్ డియాగోలోని మిరామర్ ఎయిర్‌బేస్ వద్ద ఈ ఘటన జరిగంది. అమెరికా వద్ద సుమారు 630కి పైగా ఎఫ్-35 యుద్ధ విమానాలు ఉన్నాయి.
శాన్ డియాగో: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎఫ్-35బీ స్టీల్త్ ఫైటర్(F-35B Stealth Fighter) విమానం కూలింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. శాన్ డియాగోలోని మిరామర్ ఎయిర్‌బేస్ వద్ద ఈ ఘటన జరిగంది. యుద్ధ విమానం నేలరాలడానికి ముందే దాంట్లో ఉన్న పైలట్ పారాచూట్ సాయంతో బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం అతనికి సమీప ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నట్లు అమెరికా మెరైన్ కార్ప్స్ తెలిపారు. విమానం కూలిన ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ, మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు వీడియోకు చిక్కాయి. మిలిటరీ సిబ్బబంది, అగ్నిమాపక వాహనాలు ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
The U.S. Marine Corps says the pilot of an F-35B stealth fighter is expected to live after ejecting from the jet before it crashed in California. The jet went down Friday near the Miramar air base in San Diego pic.twitter.com/HYAc7U0Cvu
— The Associated Press (@AP) July 31, 2026
రెండు విమానాలు రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో మొదటి విమానం సురక్షితంగా దిగిందని, ఇక రెండో విమానం కాసేపు గాలిలోనే ఉండిపోయిందని, భూమికి సుమారు 100 ఫీట్ల ఎత్తులో ఉన్న సమయంలో దాని పైలట్ ఎజక్ట్ అయ్యాడని, ఆ విమానం మరో విమానం పక్కనే కూలిపోయిందని ఓ వ్యక్తి వెల్లడించాడు. స్టీల్త్ విమానం రన్‌వే మీదకు వెళ్లిన తర్వాత పేలినట్లు శాన్ డియాగో అగ్నిమాపక సిబ్బంది ప్రతినిధి కాండేస్ హాడ్లే తెలిపారు.
శాన్ డియాగోలో నేవీ ఫైటర్ పైలట్ల శిక్షణ స్కూల్ ఉన్నది. మెరైన్ కార్ప్స్ ఈ బేస్‌ను వినియోగిస్తున్నారు. 2024 ప్రభుత్వ డేటా ప్రకారం అమెరికాకు చెందిన మెరైన్ కార్ప్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్ వద్ద సుమారు 630కి పైగా ఎఫ్-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఎఫ్-35బీ స్టీల్త్ ఫైటర్ విమానం ఖరీదు సుమారు 109 మిలియన్ల డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు.
Footage from Fox of fire fighters on scene of what’s being reported as an aircraft mishap involving a F-35B stealth fighter. Fox reporting that the pilot has been recovered and taken to a medical facility. pic.twitter.com/2hMKAS1OGp
— Acyn (@Acyn) July 31, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

