అలంపూర్, ఆగస్టు 7 : బిల్లు చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసిన అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. అలంపూర్ మున్సిపాలిటీలో రూ.4 లక్షలతో చేపట్టిన వాటర్ పైపులైన్ వాల్ పనులకు సంబంధించి ఎంబీ రికార్డు చేయాలని ఇరిగేషన్ డీఈఈ శ్రీకాంత్నాయుడును సదరు కాంట్రాక్టర్ సంప్రదించాడు.
బి ల్లులో 3శాతం డబ్బులు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయగా.. రూ.11 వేలకు బేరం కుదిరింది. గురువారం అలంపూర్‌లోని ఇరిగేషన్ కార్యాలయం లో డీఈఈకి కాం ట్రాక్టర్ డబ్బులు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు.