IND vs RSA | నాకౌట్లో టాపార్డర్ ఫ్లాప్.. సగం ఓవర్లకే సగం వికెట్లు..!
IND vs RSA : భారీ ఛేదనలో భారత టాపార్డర్ కుప్పకూలింది. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్(0) డకౌట్‌తో మొదలు.. పవర్ ప్లేలోనే వికెట్లతో దక్షిణాఫ్రిక బౌలర్లు టీమిండియాపై ఒత్తిడి పెంచారు.
IND vs RSA : భారీ ఛేదనలో భారత టాపార్డర్ కుప్పకూలింది. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్(0) డకౌట్‌తో మొదలు.. పవర్ ప్లేలోనే వికెట్లతో దక్షిణాఫ్రిక బౌలర్లు టీమిండియాపై ఒత్తిడి పెంచారు. క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్ యాదవ్(18) గేర్ మార్చే క్రమంలో షార్ట్ మిడ్వికెట్లో బ్రెవిస్‌కు సులువైన క్యాచ్ ఇచ్చాడు. అంతే.. 51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది భారత్. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, శివం దూబేలు ఆడుతున్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 57-5.
ఆరంభంలో కట్టడి చేసి.. ఆపై పట్టు సడలించి దక్షిణాఫ్రికాకు భారీ స్కోర్ అవకాశమిచ్చిన టీమిండియా ఛేదనలో తడబడుతోంది. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్(0)ను ఎడెన్ మర్క్రమ్ ఔట్ చేయగా.. యాన్సెన్ తొలి బంతి ఎడ్జ్ తీసుకోగా తిలక్ వర్మ(1) వికెట్ కీపర్ డికాక్ చేతికి చిక్కాడు.
Corbin Bosch strikes again as the skipper Suryakumar Yadav departs for 1⃣8⃣
📸:- JioHotstar #INDvsSA #Super8s #T20WC2026 #Insidesport #CricketTwitter pic.twitter.com/iaJs35Mb8P
— InsideSport (@InsideSportIND) February 22, 2026
ఆదిలోనే రెండు వికెట్లు పడిన వేళ.. ఓపెనర్ అభిషేక్ శర్మ(15) 6, 4తో ఆశలు రేపినా.. యాన్సెన్ అతడిని బోల్తా కొట్టించాడు. 26కే వికెట్లు పడిన వేళ.. కెప్టె్న్ సూర్యకుమార్ యాదవ్(18), వాషింగ్టన్ సుందర్(11)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, ఈ ద్వయాన్ని విడదీస్తూ సుందర్‌ను కార్బిన్ బాస్చ్ పెవిలియన్ చేర్చాడు. రన్‌రేటు ఒత్తిడిలో గేర్ మార్చాలనుకున్న సూర్య తేఇలికైన క్యాచ్‌తో వికెట్ ఇచ్చేశాడు. దాంతో.. 51వద్ద ఐదో వికెట్ పడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

