నార్నూర్, ఆగస్టు8 : కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం మానుకోవాలని నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఆదివాసీ సంఘాల నాయకులు, లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి విషయంలో ప్రొటోకాల్ పాటించకపోవడ సమంజసం కాదన్నారు.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రొటోకాల్ పాటించాల్సిందేనని స్పస్టం చేశారు. ఆదివాసీ ఎమ్మెల్యే మహిళ అని గౌరవించకుండా కార్యక్రమంలో అవమానించడంపై మండిపడ్డారు.
లంబాడీలు, ఆదివాసులు కలిసికట్టుగా ఉంటున్న తరుణంలో రాజకీయ కోసం కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అజ్మీరా శ్యాం నాయక్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావు, మండల అధ్యక్షుడు హనుమంతరావు, సర్పంచుల సంఘం మాజీమండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, మాజీ సర్పంచులు రాథోడ్ విష్ణు, కనక ప్రభాకర్, ఆడ శ్రీరామ్, నాయకులు రాథోడ్ సుభాష్, దయానంద్, ఫిరోజ్ ఖాన్, మెస్రం మానిక్ రావు, రాథోడ్ దేవ్ కాబాయి తదితరులున్నారు.