Dacoit | టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ కాంబోలో వస్తున్న చిత్రం డెకాయిట్ (Dacoit). షనీల్ డియో కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ధురంధర్ 2, టాక్సిక్ సినిమాలతో పోటీ వల్ల పక్కకు తప్పుకుంది. కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించాల్సి ఉంది. రిలీజ్ డేట్‌పై డైలామా కొనసాగుతుంటే.. మరోవైపు మేకర్స్ మాత్రం మ్యూజికల్ ప్రమోషన్స్‌కు రెడీ అయ్యారు.
కొత్త విడుదల తేదీ ప్రకటించకుండానే ఫిబ్రవరి 27న డెకాయిట్ ఫస్ట్ సింగిల్ Rubaaro ట్రాక్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఈ రొమాంటిక్ ట్రాక్తోనైనా విడుదల తేదీపై క్లారిటీ ఇస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు. తాజా టాక్ ప్రకారం ఏప్రిల్ ఫస్ట్ హాఫ్‌లో డెకాయిట్ విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అడివిశేష్ హీరోగా నటించిన క్షణం, గూఢచారి చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసిన షనీల్ డియో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
#Dacoit First Single #Rubaroo Out on February 27. pic.twitter.com/cId4EiQDPf
— Suresh PRO (@SureshPRO_) February 23, 2026
The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
Nani | మాస్ మోడ్‌లో నాని.. ‘బ్లడీ రోమియో’లో నేచురల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
MSG | ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ – రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా సంచలనం!