The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
The Paradise | నేచురల్ స్టార్ నాని అభిమానులు ది ప్యారడైజ్ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి ఇటీవల సూపర్ అప్డేట్ వచ్చింది. నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజా పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.
The Paradise | నేచురల్ స్టార్ నాని అభిమానులు ది ప్యారడైజ్ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి ఇటీవల సూపర్ అప్డేట్ వచ్చింది. నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజా పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఫిబ్రవరి 24న ‘ఆయా షేర్’ అనే టైటిల్‌తో రానున్న ఈ పాటను బర్త్‌డే ట్రీట్‌గా రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించగా, తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.ఇందులో నాని ఎనర్జీ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
నానిని దర్శకుడిగా పరిచయం చేసిన దసరా తర్వాత మళ్లీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల– నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘ఆయా షేర్’ పాటను వందలాది డ్యాన్సర్లతో రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున చిత్రీకరించినట్టు యూనిట్ వెల్లడించింది. ఈ సాంగ్‌లో నాని మాసీ అవతార్‌లో కనిపించనున్నారని, అభిమానులకు సర్ప్రైజ్ ప్యాకేజ్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ పాటకు చార్ట్‌బస్టర్ బాణీలు అందించినది ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. సుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. బర్త్‌డే సందర్భంగా విడుదలయ్యే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
మొదట మార్చి 26న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని వాయిదా వేసి, ఇప్పుడు ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘ది ప్యారడైజ్’ను పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా సినిమా విడుదల కానుంది. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఎడిటర్‌గా నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్‌గా సి.హెచ్. సాయి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్ల పని చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం నాని కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.
https://youtu.be/Z2-_EYDUFAk?si=lfCLXpzkbqNYlVe7
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

