భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 23 : భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో మద్యపాన నిషేధం అమలుకు గ్రామ సర్పంచ్ కర్నాటి వరలక్ష్మి , నూతన పాలకవర్గం సోమవారం గ్రామ పంచాయతీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పాలకవర్గం హెచ్చరించింది. మార్చి 1వ తేదీ నుండి మద్యపాన నిషేధం అమలులోకి వస్తుందని, ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని సర్పంచ్ కోరారు. మద్యం అమ్మే వారికి గ్రామ పంచాయతీ నుండి నోటీసులు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కందాల సత్తిరెడ్డి, శేఖర్, రమా, సునీత, రాణి, లింగస్వామి, కవిత పాల్గొన్నారు.