Cabinet expansion | వచ్చే వారమే కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. వెల్లడించిన డీకే శివకుమార్
Cabinet expansion | కర్ణాటక (Karnataka) మంత్రివర్గాన్ని వచ్చే వారం విస్తరించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి (Chief Minister) డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. మంత్రులంతా ఐక్యంగా పనిచేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. శనివారం చిత్రదుర్గలో జరిగిన బెంగళూరు రీజనల్ డివిజన్ అభివృద్ధి ప్రగతి సమీక్ష సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Cabinet expansion : కర్ణాటక (Karnataka) మంత్రివర్గాన్ని వచ్చే వారం విస్తరించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి (Chief Minister) డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. మంత్రులంతా ఐక్యంగా పనిచేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. శనివారం చిత్రదుర్గలో జరిగిన బెంగళూరు రీజనల్ డివిజన్ అభివృద్ధి ప్రగతి సమీక్ష సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘కేబినెట్‌ను వచ్చే వారం విస్తరించవచ్చు. అది జరిగిన వెంటనే మంత్రులంతా చేతులు కలిపి పనిచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితిని సమష్టిగా అంచనా వేసి, గ్రామాల్లో రైతులు ఇబ్బంది పడకుండా చూడటం మనందరి బాధ్యత’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అంతకుముందు ఆయన చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వడ్డికెరె గ్రామంలో పర్యటించి, కరువు రైతులపై చూపుతున్న ప్రభావాన్ని స్వయంగా పరిశీలించారు.
ప్రభుత్వానికి, పరిపాలనకు కొత్తరూపు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని, శాసనసభ్యులు, అధికారులు టీమ్ కర్ణాటకగా పనిచేయాలని శివకుమార్ పిలుపునిచ్చారు. పాలన ప్రతి పౌరుడి గడప వద్దకు చేరాలని, ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకే ‘ప్రజా సేవా’ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.1 కోటి వరకు ఖర్చు చేసే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉందని శివకుమార్ పునరుద్ఘాటించారు.
కొత్తగా వేసిన బోరుబావుల జీపీఎస్ వివరాలు నమోదు చేయాలని, కరువు సహాయక చర్యల్లో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు, పశువులకు తాగునీటి కొరత రాకుండా, పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. భవిష్యత్తులో వర్షాలు కురుస్తాయనే అంచనాలతో రైతులు పంటలు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పంటలు వేసి నష్టపోతే బాధ్యత వారే వహించాల్సి ఉంటుందని, పంటల బీమాపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
అల్మట్టి మినహా చాలా జలాశయాల్లో నీటి మట్టాలు తక్కువగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేసే స్థితిలో లేమని సంబంధిత కమిటీకి తెలియజేశామన్నారు. ఎల్‌నినో ప్రభావంపై ప్రధాని మోదీ కూడా హెచ్చరించారని, రాష్ట్రంలోని కరువు పరిస్థితులను వివరించేందుకు త్వరలో డిప్యూటీ సీఎం పరమేశ్వర నేతృత్వంలోని బృందం ప్రధానిని కలుస్తుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

