WI vs ZIM : ప్రపంచకప్‌లో నాకౌట్ దశలో జింబాబ్వే, వెస్టిండీస్ కీలక మ్యాచ్‌లో తలపడుతున్నాయి. అజేయంగా లీగ్ దశను దాటొచ్చిన ఇరుజట్లు సూపర్ 8లో పంజా విసిరేందుకు సిద్ధమయ్యాయి. సోమవారం వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లోల టాస్ గెలిచిన సికిందర్ రజా విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
సూపర్ 8 తొలిమ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయంతో గ్రూప్ ఏలో సెమీస్ సమీకరణాలు ఆసక్తిగా మారాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న జింబాబ్వే.. వెస్టిండీస్‌లు విజయంపై కన్నేశాయి. కీలకమైన ఈ గేమ్‌లో ఇరుజట్లు చెరొక మార్పుతో ఆడుతున్నాయి.
A rare encounter between West Indies and Zimbabwe – just their second meeting at the #T20WorldCup!
One change for each side – Richard Ngarava returns in place of Wellington Masakadza for Zimbabwe, Romario Shepherd replaces Roston Chase for West Indies pic.twitter.com/qBBSbEh1TO
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2026
పవర్ హిట్టర్లతో నిండిన విండీస్‌ను ఆఫ్రికా పేసర్లు ముజరబని, ఎవాన్స్.. రజా, క్రీమర్ స్పిన్ ద్వయం ఏ మేరకు నిలువరిస్తుంది? అనేది ఆసక్తికంరంగా మారింది. వరల్డ్‌కప్‌లో అజేయంగా రాణిస్తున్న ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ ఛేదనలో జింబాబ్వేకు కీలకం కానున్నాడు. వాంఖడేలో గెలుపుతో రెండు పాయింట్లు సాధించేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
జింబాబ్వే తుది జట్టు : బ్రియాన్ బెన్నెట్, తడివనషె మరుమని(వికెట్ కీపర్), రియాన్ బర్ల్, సికిందర్ రజా(కెప్టెన్), తసింగ ముసెకివా, టోనీ మున్యోంగ, డియాన్ మేయర్స్, బ్రాడ్ ఎవాన్స్, గ్రీమ్ క్రీమర్, రిచర్డ్ నగవర, బ్లెస్సింగ్ ముజరబని.
వెస్టిండీస్ తుది జట్టు : బ్రాండన్ కింగ్, షాహ్ హోప్(కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రన్ హిట్మైర్, రొవ్మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫొర్డే, అకీల్ హొసేన్, గుడకేశ్ మోతీ, షమర్ జోసెఫ్.