రామాయంపేట, ఆగష్టు 08 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అడ్డుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన 8మంది లబ్దిదారులు తహసీల్దార్ రజినికుమారికి తమ గోడు వెల్లబోసుకుని వినతి పత్రం అందజేశారు. తమకు ఇళ్లు మంజూరై ఇప్పటికే నెలరోజులు గడుస్తుందని ఇంత వరకు ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టలేదని తెలిపారు.
తమ ఇళ్లకు అడ్డుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను అక్కడి నుండి తొలగిస్తే మా ఇండ్లకు పైన ఉన్న కేబుల్ ఇక అడ్డు రాదని తెలిపారు. దీంతో ఈ విషయమై సంబంధిత విద్యుత్ అధికారులకు చెప్పి సమస్యను పరిష్కరి స్తానని తహసీల్దార్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు కూడా విన్నవించడం జరిగిందన్నారు.అ బ్దిదారుల వెంట విద్యాసాగర్, మామిడి సిద్దరాములు తదితరులు ఉన్నారు.