బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓ యువకుడిపై కేసు నమోదైన సంఘటన బుధవారం నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నో పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన బైక్ను ఫొటో తీశాడన్న కోపంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వరంగల్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10,11,12 తేదీలలో నిర్వహించే పీడీఎస్యూ 23వ తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు రాచర్ల బాలరాజు పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయురాలు ప్రవళిక డిప్యూటేషన్ పై వేరే పాఠశాలకు పంపడాన్ని నిరసిస్తూ, వెంటనే డిప్యూటేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో బంద్ పాటించారు.
లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టి రైతుల పంటలకు సరైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.