కారేపల్లి,ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఖమ్మం జిల్లా కారేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా కీర్తి గణించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని, ప్రజా రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగిందని,దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన మహోన్నతుడుగా చరిత్ర సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.
కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ,మాజీ జెడ్పిటిసిలు ఉన్నం వీరేందర్,వాంకుడోత్ జగన్, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు,మాజీ సొసైటీ వైస్ చైర్మన్,సర్పంచ్ ధరావత్ మంగీలాల్, నాయకులు బానోతు కుమార్,పిల్లి వెంకటేశ్వర్లు,డొంకన రవీందర్, తాత వెంకటేశ్వర్లు,భానోత్ రాందాస్,సోమందుల నాగరాజు,జిమ్కిలాల్,పెద్ద బోయిన సురేష్,వీర్య నాయక్, హచ్చు నాయక్, నాగేశ్వరరావు,తాత ఉపేందర్, శంకర్,ఖలీల్ ఉల్లాఖాన్, రాము నాయక్,మాలోతు ప్రసాద్,పేర్ని వెంకటేశ్వర్లు, ధరావత్ రాజు,చింతల కృష్ణ, చింతల సంపత్ కుమార్, భగవాన్ లాల్,పోతు రాములు,దుండి సైదులు,హారు నాయక్,మంగ్యా నాయక్, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.